Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను విజయ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో విజయ్ పక్కా ట్రెడిషనల్ లుక్‌లో పంచె కట్టుకుని కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
విజయ్ తన తల్లిదండ్రులు మరియు తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు, గాలిపటాలతో పండుగ వాతావరణం ఉట్టిపడింది. “మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.. ఈ ఏడాది అందరికీ సుఖసంతోషాలు కలగాలి. వచ్చే ఏడాది మాత్రం ఖచ్చితంగా మా ఊర్లో పండుగ జరుపుకుందామని మా అమ్మకు ప్రామిస్ చేశాను. అంటూ విజయ్ రాసుకోచ్చచాడు.
సినిమాల విషయానికి వస్తే.. విజయ్ ప్రస్తుతం రాహుల్‌తో పాటు రవికిరణ్ కోలాతో సినిమాలు చేస్తున్నాడు. పండుగ కోసం చిన్న విరామం తీసుకున్న విజయ్, త్వరలోనే మళ్ళీ షూటింగ్ సెట్స్‌లో జాయిన్ కానున్నారు. విజయ్ పంచుకున్న ఈ ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Happy Sankranthi to all of you my beautiful people ❤️
From our family to all of your families 🙂 Next year i promised mom to celebrate it in the village. pic.twitter.com/D6ZML4wLVc
— Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2026