BMC Exit Polls : మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లోని 227 స్థానాలుకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినట్టు నిక్కచ్చిగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సంస్థగా గుర్తింపు పొందిన ప్రజా పోల్ ఎనలిటిక్స్ (పీపీఎ) ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార బీజేపీ కూటమి, ఠాకరే సోదరుల మధ్యనే ఉండనున్నట్టు అర్థమవుతున్నది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ కూటమి ముందు ఉన్నట్టు పీపీఏ అంచనా వేసింది.
పీపీఏ అంచనా ప్రకారం.. కమల కూటమికి 146(+\-15) సీట్లు.. శివసేన యూబీటీ కూటమి 53 (+\-8) సీట్లు, కాంగ్రెస్ కూటమి 15 సీట్లు (+\-3), ఇతరులకు 13 సీట్లు రానున్నట్టు పీపీఏ అంచనా వేసింది.
కాగా యూపీ, బీహార్, ఏపీ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ముందే కచ్చితత్వంతో అంచనా వేయడంలో పీపీఏ సక్సెస్ రేట్ నూరు శాతంగా ఉండటం విశేషం.