Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల రెడ్డి టిఫిన్ సెంటర్ ఎదుట బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి పార్కింగ్ చేసిన ఐదు బైకులతో పాటు ఒక అంబులెన్స్ ను ఢీకొట్టింది. అలాగే బైక్ ను పార్కింగ్ చేస్తున్న వారిని ఢీకొనడంతో సుల్తానా (23), ఆహ్వాన్(02) లు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమాన వ్యక్తం చేశారు.
అలాగే రెడ్డి టిఫిన్ సెంటర్ వద్ద ప్రతిరోజు రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై పట్టణ సీఐ నరహరి వివరణ కోరగా కారు నడుపుతున్న వ్యక్తి ఇందల్వాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, మద్యం సేవించి బ్రేక్ మీద కాలు వేయబోయి ఎక్స్ లెటర్ మీద కాలు వేయడంతోనే ఈ ప్రమాదం వాటిల్లిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనపై డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.