వినాయక నగర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 17 మందిపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ పట్టుబడిన వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు.
వారిని నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరు పర్చారు. సీహెచ్ భాస్కర్, తోట బాలయ్య, గావల్వాడ్ సురేష్, కాలగడ్డ ప్రవీణ్ అనే నలుగురు వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మిగతా 13 మంది వాహనదారులకు రూ.14,500 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు.