మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో (Laxmi Narasimha Swamy ) జరుగుతున్న అభివృద్ధి పనులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి చెందిన పురం తిరుపతిరావు -కవిత తమ కుమారుడి మొదటి నెల వేతనం రూ. 51,016 విరాళనాన్ని(Donation) ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రావుకు అందజేశారు.
ఈ సందర్భంగా దాతలను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి శాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు శ్రీనివాసచార్యులు, పరందామాచార్యులు, నరసింహచార్యులు, సంజీవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో భక్తుల సందడి
చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నట్టు ఈవో తెలిపారు. సరిహద్దు జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.