banswada | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య జయంతిని మండలంలోని తాడ్కోలు గ్రామంలో గురువారం నిర్వహించారు. కురుమ సంఘం భవనంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు వీరేశం, సాయిలు, బీరయ్య, గంగారాం, పండరి, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.