Nizamabad | బాన్సువాడ రూరల్, జూన్ 15 : బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ఎంఈవో తెలిపారు.
ఇప్పటికే మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 42461 నోటు బుక్కులను అందేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.