school bags | పోతంగల్ జూలై 16: మండలంలోని సుంకిని మండల పరిషత్ పాఠశాలలో 41మంది విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు వితరణ చేశారు. విద్యార్థుల సౌకర్యార్ధం ఎన్ఆర్ఐ కొనేరు శశాంక్ స్కూల్ బ్యాగులను అందజేయడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మార్కెల్లి ప్రకాష్ పటేల్, నాయకులు మల్లెపూల రాజాగౌడ్, నాగనాథ్, లక్ష్మణ్, శంకర్ పటేల్, రాజు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.