ఏర్గట్ల, ఫిబ్రవరి8: కల్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడబిడ్డల పెండ్లిలకు సాయం అందిస్తున్నారని అన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
14 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసినట్లు తహసీల్దార్ జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు అశ్రఫ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్, సర్పంచులు గుల్లే లావణ్య గంగాధర్, పత్తిరెడ్డి ప్రకాశ్‌రెడ్డి, కట్కం పద్మసాగర్రెడ్డి, అర్ఐ సదానంద్ తదితరులు పాల్గొన్నారు.