మద్నూర్, జూలై 7: జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పలువురు లబ్ధిదారులకు ఆదివారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 56 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. మద్నూర్ తహసీల్దార్ ముజీబ్, మండలాల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.