KamaReddy | కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గల సర్వే నంబర్-6లో గత 20ఏళ్లగా రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన నివాసపు గుడిసెలు షెడ్లను కూల్చి వేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పాలయ్యారు.
ఆ విషయం టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్పందించి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, నిమ్మ విజయకుమార్ రెడ్డి, పంపరి శ్రీనివాస్, జూలూరు సుధాకర్, చాట్ల వంశీ, సలీం, శంకర్రావు, గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్, రంగ రమేష్, నర్సిల్ల మహేష్, బల్ల శ్రీనివాస్, కోటి, పండు శ్రీకాంత్, ఆకాష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.