హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని నిలిపివేశారు. పేద దళిత విద్యార్థుల కోసం ఉన్న బెస్ట్ అవైలబుల్ సీమ్ నిర్వీర్యానికి కుట్ర పన్నారు. మీరు దళితజాతి రక్షోద్ధారకుడు ఎలా అవుతారు?’ అని రేవంత్‌రెడ్డిని బెస్ట్ అవైలబుల్ సీమ్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్ మాదిగ ప్రశ్నించారు. ఒకవైపు దళిత పక్షపాతి అని చెప్పుకుంటూనే, మరోవైపు తమ పిల్లల చదువులను దూరం చేస్తున్న మిమ్మల్ని దళితులు ఎలా నమ్మాలి? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేతలకు పొంతన లేదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బెస్ట్ అవైలబుల్ సీమ్ కింద పూర్తి నిధులు విడుదల చేశామని పేపర్లలో ప్రకటనలు ఇస్తూ, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం శోచనీయమని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా మాటలు కట్టిపెట్టి దళిత విద్యార్థుల హకులను కాపాడాలని, నిలిపివేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మావోయిస్ట్ అంత్యక్రియలకు హాజరైన వారికి ఎన్ఐఏ నోటీసులు
కోహెడ , మార్చి 6 : మావోయిస్టు అంత్యక్రియల్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జాతీ య దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పలువురికి నోటీసులు జారీ చే శారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండ లం తీగలకుంటపల్లికి చెందిన ప్రముఖ మావోయిస్ట్ రాంచంద్రారెడ్డి ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అతని స్వగ్రామమైన తీగలకుంటపల్లిలో అంత్యక్రియలు ని ర్వహించారు. ఈ అంత్యక్రియలకు హాజరైన 10మందికి ఎన్ఐఏ నోటీసు లు జారీచేసింది. అంత్యక్రియల్లో ప్ర భుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని విమర్శలు చేయడంతో ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయమై కోహెడ పోలీసులను వివరణ కోరగా, నోటీసులు జారీ విషయం తమకు తెలియదని సమాధానం ఇచ్చారు.