ఏర్గట్ల/బాల్కొండ, డిసెంబర్ 25: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్‌ప్యాక్‌లను కమ్మర్‌పల్లిలో పాస్టర్ అనంత్‌రావు, ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ చర్చిలో క్రైస్తవులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీస్తు జన్మదినం రోజు క్రైస్తవులకు దుస్తులు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల వారికి ఆయా పండుగలకు దుస్తులు అందజేయడం గొప్పవిషయమని కొనియాడారు. ముఖ్యమంత్రితో పాటు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎల్లవేళలా శుభం కలగాని కోరుతూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచులు పద్మసాగర్రెడ్డి, బాగిర్థకిషన్, పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గంగారాం నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు కూతురు చిన్న సాయన్న, రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ మాస్ గంగాధర్, పార్టీ నాయకులు గంగాధర్ యాదవ్, యుగేంధర్ పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో క్రిస్మస్‌వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో చర్చిలో క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌లను అందజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్‌ను చేసి అందరికి పంచి పెట్టారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు.