కమ్మర్పల్లి : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే వంట పాత్రాలను (Cooking utensils ) అందజేశారు. 1998-99 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు రూ. 20వేల విలువ గల వంటపాత్రలను వితరణగా ఇచ్చారు. వంట పాత్రలను ప్రధానోపాధ్యాయుడు ఆంధ్రయ్యకు బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ పాఠశాలకు సహకారం అందిస్తున్న పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, రామకృష్ణ స్వామి, పూర్ణచందర్, నరేష్, సత్యనారాయణ, వీడీసీ చైర్మన్ కొమ్ముల రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.