బాల్కొండ : అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ప్రభుత్వం అందజేసే సీఎంఆర్ఎఫ్ (CMRF Checks) చెక్కును కాంగ్రెస్ (Congress) నాయకులు అందజేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కృషితో మండలంలోని రాధ అనే బాధితురాలికి రూ. 33 వేలు , జక్క భూమన్నకు రూ. 40 వేలు, గండ్ర సుజాతకు రూ. 17, 500, నల్ల అశ్వినికి రూ. 13, 500 చెక్కులను శనివారం బాల్కొండ (Balkonda) కాంగ్రెస్ నాయకుల అందజేశారు.
కార్యక్రమంలో టౌన్ మైనార్టీ అధ్యక్షులు జావిద్, టౌన్ ఇన్చార్జి మోహన్ రెడ్డి, కుందరాపు శ్రీనివాస్, మేక సతీష్, నవీన్, అన్వర్, మజార్, మెట్టు అశోక్, పద్మారావు, సల్లఉద్దీన్, దివాన్ వెంకటేష్, కుమ్మరి గంగాధర్, గుండ్ల కిషన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.