Dharmapuri Sanjay | కంటేశ్వర్, నవంబర్ 21 : నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘాల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జై కిసాన్ మున్నూరు కాపు సంఘం గౌతమ్ నగర్ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు అమీర్ శెట్టి రవికుమార్ మాట్లాడుతూ ధర్మపురి సంజయ్ ఎన్నికపట్ల హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాలోని మున్నూరు కాపు సంఘాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘాలు ఏర్పాటై అభివృద్ధి చెందాయని, ఆయన ఆశయాలతో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జీ రామ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎర్రం కృష్ణ, గౌరవ అధ్యక్షుడు ఆమిరిశెట్టి రాజేందర్ కోశాధికారులు గురువప్ప నవీన్, రఘుపతి, మనోజ్ కుమార్, సిర్నాపెల్లి లక్ష్మణ్, సభ్యులు ఆకుల నరేందర్, మహేశ్వర్, రాజు, వేణు, శివకుమార్, విజయ్, సందీప్, మహేష్, తుమ్ము రాజు, సందీప్, కర్ణాకర్, విజయ్ కుమార్, దుర్గ ప్రసాద్, బాలకృష్ణ, సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.