నిజామాబాద్ క్రైం, జనవరి 25 : నాన్ బెయిలెబుల్ వారెంట్స్‌పై డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. అంతేకాకుండా నేరాల నియంత్రణకు అవసరమై న చర్యలు తీసుకోవాలని.. చిన్నపాటి నేరాలు సై తం జరగకుండా దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన నేరాలపై త్వరితగతిన విచారణ జరి పి పెండింగ్ కేసుల శాతాన్ని తగ్గించాలన్నారు. బు ధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశా రు.
షీ టీమ్స్ మరింత సమర్థవంతంగా పని చేసే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి ఒక సి బ్బంది హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టంను తప్పకుండా వాడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచించారు. మ ట్కా, గంజాయి, గ్యాంబ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించి త్వరితగతిన దర్యా ప్తు పూర్తి చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని పేర్కొన్నారు. క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం(సీసీటీఎన్ఎస్)లో ప్రతి పోలీస్ స్టేషన్‌లోని ఎఫ్ఐఆర్, కేసుల పరిశోధనా వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మ రం చేయడంతోపాటు బీట్లు ఏర్పాటు చేసి, రాత్రి సమయంలో వాహనాలు తనిఖీ చేయాలన్నారు.
ప్రధానంగా దొంగతనాల నివారణకు కృషి చేయాలని వెల్లడించారు. లాడ్జీల్లో తరచూ తనిఖీలు చేయాలన్నారు. పెండింగ్ చలానాలు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మోటర్ వాహనాల యాక్టు ప్రకారం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాత నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. గ్రా మాల్లో పోలీస్ కళాబృందాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, సీసీఎస్ ఏసీపీలు, ఏ.వెంకటేశ్వర్, ఆర్. ప్రభాకర్ రావు, కె.ఎం.కిరణ్ కుమార్, జి.మధుసూదన్ రావు, నారాయణ, రమేశ్, ఎస్బీఐ శ్రీశైలంతో పాటు వర్టికల్ ఆఫీసర్స్, సీఐలు, కమ్యూనికేషన్ సీఐ నవీన్‌కుమార్ అధికారులు పాల్గొన్నారు.