Cyber fraud | బీర్కూర్‌లో సైబర్ మోసం.. రూ.95 వేలు పోగొట్టుకున్న యువకుడు
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ.95వేలు పోగొట్టుకున్నాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
Cyber fraud | నస్రుల్లాబాద్ జూన్ 7: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ.95వేలు పోగొట్టుకున్నాడు. బీర్కూర్ గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మే నెల 2న వాట్సాప్ గ్రూపులో ఆర్టీవో చలాన్ లింక్ వచ్చింది. యువకుడు ఆ లింక్ ని ఓపెన్ చేసి లింక్ అడిగిన వివరాలను నమోదు చేశాడు.
జూన్ 3న తన ఖాతాలో రూ. లక్ష నగదును జమ చేశాడు. జూన్ 6న సాయంత్రం యువకుడి ఖాతాలో నుండి ఆరు దఫాలుగా మొత్తం రూ.95 వేల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. నగదు పోయిన వివరాలు మెసేజ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, 1930కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

