వినాయక్‌నగర్, సెప్టెంబర్ 24: అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇద్దరు అమాయకులను టార్గెట్ చేసి కోట్ల రూపాయలను దండుకున్నారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ మార్గంలో దందాను నిజామాబాద్ కేంద్రం గా నడిపి కోట్లు వసూలు చేశారు. మూడేండ్లు గా కొనసాగుతున్న ఈ దందాలో తాము మో సపోయినట్లు గుర్తించిన ఒక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించా రు. ఆరు నెలలుగా పరారీలో ఉన్న నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇందుకు సం బంధించిన వివరాలను నిజామాబాద్ సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) ఏసీపీ నాగేం ద్రా చారి బుధవారం తమ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
నగరంలోని ఆస్మి కాలనీకి చెందిన మహ్మద్ మొయిజ్ఖాన్, మహ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ అమీద్ హుస్సేన్ కలిసి క్రిప్టో కరెన్సీ పేరుతో స్పెయిమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాను ప్రారంభించారు. అందులో నిజామాబాద్‌తోపాటు ఇతర జిల్లాల వారిని చేర్చుకొని.. తమ కంపె నీ యూఎస్ డాలర్లను ట్రేడింగ్ చేస్తుందని నమ్మించారు. హైదరాబాద్ ప్రాంతం లో భారీ కంపెనీని ఏర్పాటు చేస్తుందని చెప్పి.. వాటాల రూపంలో డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారిని థాయిలాండ్, గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ప్రాంతా ల్లో ఆఫీసులను ఓపెన్‌చేసి, అక్కడ తమ ఏజెంట్ల ద్వారా ప్రజలతో పెట్టుబడులు పెట్టించారు.
రెండేండ్ల కాలంలో 125 మంది నుంచి రూ.8.50 కోట్లు దండుకున్నారు. చివరకు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను కంపెనీ మోసం చేసిందని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉండగా.. సీపీ ఆదేశాలతో సీసీఎస్ ఏసీపీ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చినట్లు ఏసీపీ నాగేంద్రాచారి తెలిపారు. సమావేశంలో సీసీఎస్ సీఐలు రవీందర్, సురేశ్ పాల్గొన్నారు.