Floodwater | పొతంగల్, ఆగస్టు 29: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు, మంజీరా వరద నీటితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 854 మంది రైతులకు చెందిన 2399 ఎకరాల సోయా, వరి పంట నష్టం వాటిల్లిందని అదికారులు అంచనా వేశారు.
పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. మండలంలోని సుంకిని గ్రామంలో మంజీరా వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలో ఎప్పటికప్పుడు అదికారులు పర్యవేక్షిస్తున్నారు. మంజీర పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోకి 1983 లో ఇలాంటి వరద వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.