Sirikonda BRS | సిరికొండ ఏప్రిల్ 23 : సీపీఎం పార్టీకి చెందిన మల్లెల సుమన్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. కాగా సుమన్‌కు జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా సుమన్ 2007 నుండి సీపీఎం అనుబంధ సంఘాలైన ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ లో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయన విధానాలు నచ్చడంతో, బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సిరికొండ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, భూషణ్ రెడ్డి, మైలారం గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్, సర్పంచ్ సత్యానంద్, ఇతర మండల నాయకులు పాల్గొన్నారు.