CPI | కోటగిరి, ఆగస్టు 18 : సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ నిరంతరం పేదల పక్ష నిలబడి పోరాటం చేసే పార్టీని, పార్టీకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చరిత్ర ఉందని పేర్కొన్నారు.
దోపిడీ వర్గం ఉన్నంతవరకు సీపీఐ ఉంటుందని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మహారాజా గార్డెన్ గాజుల రామారావు షాపూర్ నగర్ మండలంలో మహాసభలు 19 నుండి 22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు జాతీయ నాయకుడు నారాయణ, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, మాజీ శాసన సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొంటారని చెప్పారు. కావున ఈ మహాసభలకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల గంగాధర్, ప్రసాద్, నీలి శంకర్, హైమద్, పాషా తదితరులు పాల్గొన్నారు.