గీత దాటితే వేటే..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోరాత్రి 10.30 గంటల తరువాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయిస్తామని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిర్ణీత సమయం పాటించకుండా కొందరు వ్యాపారులు అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా తెరిచి ఉంచుతున్నట్లు తమ పరిశీలనలో వెలుగుచూసినట్లు తెలిపారు.
- పదిన్నర తర్వాత తెరిచి ఉంటే పర్మినెంట్గా క్లోజ్
- సీపీ కల్మేశ్వర్ హెచ్చరిక…
వినాయకనగర్, ఫిబ్రవరి 26: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోరాత్రి 10.30 గంటల తరువాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయిస్తామని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిర్ణీత సమయం పాటించకుండా కొందరు వ్యాపారులు అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా తెరిచి ఉంచుతున్నట్లు తమ పరిశీలనలో వెలుగుచూసినట్లు తెలిపారు.అర్ధరాత్రి వరకు వ్యాపార సముదాయాలను తెరిచి ఉంచడంతో అవి నేరాలు చేసే వ్యక్తులకు అడ్డాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
రాత్రి 10.30 గంటల లోపు వ్యాపార సముదాయాలు మూసివేయాలని, ఇందుకోసం ప్రత్యేకఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టగా.. నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఐదు షాపుల పై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరు యజమానులకు నాలుగు రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

