వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలవండి
రాష్ట్రంలోని వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలువాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కు విజ్ఞప్తిచేశారు. తమ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. గురువారం తెలంగాణ భవన్లో వీఆర్ఏల ప్రతినిధులు ఆర్ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు.
- 3,797 కుటుంబాలకు ఉద్యోగాలివ్వకుండా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేస్తున్నది
- బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీకి వీఆర్ఏ ప్రతినిధుల వినతి
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వీఆర్ఏ కుటుంబాలకు అండగా నిలువాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కు విజ్ఞప్తిచేశారు. తమ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. గురువారం తెలంగాణ భవన్లో వీఆర్ఏల ప్రతినిధులు ఆర్ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. రాష్ట్రంలోని 20,555 మంది వీఆర్ఏలలో 16,758 మందికి మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందని, మిగిలిన 3,797 వీఆర్ఏ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలు 80 రోజులపాటు సమ్మె చేసిన సందర్భంగా వారి సమస్యలపై ఐఏఎస్ అధికారుల కమిటీ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని సంఘం ప్రతినిధులు తెలిపారు. వీఆర్ఏల విద్యార్హతలకు అనుగుణంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో సర్దుబాటు చేసేందుకు అప్పటి ప్రభుత్వం జీవో-81 జారీ చేసిందని, ఇదే జీవో పరిధిలో 3,797 కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి నరసింహులు బోయ, నాయకులు సంగమేశ్వర్, అనిల్, రాకేశ్, విజయ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

