Bairanpally Matrys | బైరాన్ పల్లిలో అమరవీరుల సంస్మరణ సభ.. ముఖ్య అతిథిగా బీవీ రాఘవులు
Bairanpally Matrys | భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలోబైరాన్ పల్లి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి.
Bairanpally Matrys | మద్దూరు (ధూళిమిట్ట), సెప్టెంబర్ 15 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ధూళిమిట్ట మండలంలోని బైరాన్ పల్లిలో ఈ నెల 17వ తేదీన అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం సీపీఎం నాయకులు బైరాన్ పల్లి గ్రామాన్ని సందర్శించి, బురుజు వద్ద ఏర్పాటు చేయనున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అమరవీరుల సంస్మరణ సభకు సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ముఖ్య అతిథితులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలోబైరాన్ పల్లి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. బైరాన్ పల్లి పోరాట స్పూర్తితో ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు.
బైరాన్ పల్లిలో జరుగుతున్న అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, కొంగరి వెంకట్‌మావో, ఆలేటి యాదగిరి, చొప్పరి రవికుమార్, మండల కార్యదర్శులు ఎండీ షఫీ, పోతిరెడ్డి రాజు, నాయకులు తప్పతి రాజు, వేల్పుల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్‌నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

