ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్
ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన గడీల భైరయ్య ఓ ప్రైవేటు న్యూస్ చానల్లో పనిచేస్తున్నాడు.
- బెదిరించి డబ్బులు వసూల్
- భార్యాభర్తల అరెస్ట్
రామారెడ్డి, జనవరి 16: ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన గడీల భైరయ్య ఓ ప్రైవేటు న్యూస్ చానల్లో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులకు మాయమాటలు చెప్పి, భయపెట్టి డబ్బులను డిమాండ్ చేసేవాడు. ఈ క్రమంలోనే జనవరి 11వ తేదీన మధ్యాహ్నం మండలంలోని ఫకీరాతండా రోడ్డు వద్ద జగదాంబతండా గ్రామానికి చెందిన భూక్యా ధూలి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నది. భైరయ్య, ఆయన భార్య భాగ్యలక్ష్మి బైక్పై వస్తూ.. ఆమెను మాట్లాడించారు. ‘నీ భర్త మరణించాడు కదా.. నీకు రూ.40 వేలు వస్తాయి. అందుకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. బైక్ వెనుకాల కూర్చున్న మేడం ఇప్పిస్తారు’ అని భైరయ్య చెప్పాడు. ఆయన మాటలను నమ్మిన ధూలి డబ్బులను తీయగా.. రూ.ఆరు వేలు లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 15వ తేదీన వాహనాలను తనిఖీ చేస్తుండగా.. భైరయ్య – భాగ్యలక్ష్మి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.ఐదు వేలు నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

