కామారెడ్డి : సమాజంలో నేరాల అదుపునకు సీసీ కెమెరాలు (CC cameras) ఎంతగానో దోహదం అవుతున్నాయని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి (IG Chandrasekhar Reddy) పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో నెలకొల్పిన కమాండ్ , కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో నూతనంగా వంద సీసీ కెమెరాలను అమర్చడం అభినందనీయమని దాతలను, పోలీసు అధికారులను అభినందించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు చేయడానికి భయపడుతారని అన్నారు. నేరస్థులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకోవచ్చని వెల్లడించారు. పోలీసులు, ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటే నేరాలను అరికట్టవచ్చని అందుకు సీసీ కెమెరాలు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. గ్రామస్థులు సైతం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలకు సహకరించిన దాతలను, పోలీసు అధికారులకు జ్ఞాపికలను అందజేశారు.