మోర్తాడ్, జూన్ 15: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,083 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1063.20 అడుగుల (13.833టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 692 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో గా వెళ్తున్నది.
ఇందులో 100 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువకు, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా 361 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 1.865 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, 0.818 టీఎంసీల నీరు అవుట్‌ఫ్లోగా వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
రెంజల్, జూన్ 15 : ఎగువ ప్రాం తంలో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి సమీపంలో ఉన్న త్రివేణి సంగమంలోకి వరద వచ్చి చేరుతున్నది. వేసవికాలంలో ఏడారిని తలపించిన త్రివేణి సంగమ క్షేత్రం.. కొత్తనీటి చేరికతో జలకళ సంతరించుకుంటున్నది. గోదావరిలోకి కొత్త నీరు రావడంతో పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.