లింగంపేట, మార్చి 2: మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. వలసల నివారణ కోసం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కొనసాగిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో ఫార్మెషన్ రోడ్డు నిర్మాణం, భూమి అభివృద్ధి , పాంపాండ్, ఫిష్ పాండ్స్ తదితర పనులు చేపడుతున్నట్లు ఎంపీ డీవో నరేశ్ తెలిపారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో పను లు నిర్వహిస్తున్నామన్నారు.