Sirikonda | సిరికొండ, సెప్టెంబర్ 7 : సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బంజారులు, గ్రామస్తులకు మధ్య జండా గద్దె విషయంలో ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొండాపూర్ బంజారులు గ్రామంలో జండా గద్దె నిర్మించడానికి పనులు ప్రారంభిస్తుండగా గ్రామ కార్యదర్శి ఎలాంటి అనుమతులు లేకుండా జండా గద్దె నిర్మించవద్దని అద్దెశించడంతో నిర్మాణం ఆపివేశారు.
సోమవారం బజారులు పూజలు నిర్వహించగా గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితిసి తోపులాట చోటుచేసుకుంది. ఇందులో కొందరు గాయలపాలయారు. పరిస్థితి మితిమీరడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. పరిస్థితిని అదుపు చేసి రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి శాంతి చేసి, సమస్యను పరిష్కరించుకునే దిశగా చూడాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా చూడాలన్నారు.