నిజాంసాగర్, అక్టోబర్ 24: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నిక ల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటక మని తేలిందని జుక్కల్ నియోజకవర్గం సరిహద్దు కర్ణాటక రాష్ర్టానికి చెందిన రైతులు, ప్రజలు అన్నారు. జుక్కల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావే శంలో కర్ణాటక రాష్ట్రం కరంజీ గ్రామానికి చెందిన రాంరెడ్డి, సురేశ్ ఎక్లారా, విజయ్‌కుమార్ చిక్లీ మాట్లా డుతూ.. ఆరు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపం బయటపడిందన్నారు. ఎన్నికలకు ముందు వారు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని వాపోయారు. తెలంగాణలో మంచి పాలన కొనసాగు తున్నదని, కాంగ్రెస్ నాయకుల మాటలు విని ఆ పార్టీకి ఓటు వేశారో ఇక అంతేగతి అన్నారు. తాము పడుతు న్న కష్టాలు మీరు పడొద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తు తం కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో మారు అవకాశం ఇవ్వాలని సూచించారు. జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కనిపిస్తున్న అభివృద్ధి చాలా బాగున్నదని, పది సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. తాము మోసపోయి నట్లు ఇక్కడి ప్రజలు మోసపోవొద్దని తాము మాట్లాడు తున్నామని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఐదు పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కుటుంబ పెద్దకు రెండు వేల రూపాయలు, పది కిలోల ఉచిత బియ్యం వంటి హామీలు ఏమీ అమలు కావడం లేదన్నారు. ఇప్పటికే తాము బాధపడుతున్నామని, రానున్న లోక్ సభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు గా ఓడిస్తామని వారు స్పష్టం చేశారు. సమావేశంలో కర్ణాటక రాష్ట్రవాసులు కల్లె స్వామి, మొయినుద్దీన్ కొల్లూర్, బాలాజీ ఔరాద్, చెరప్పా బీదర్, కృష్ణ బాదల్ గావ్, బస్వరాజ్ బెళకొని తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతుగా ప్రచారం చేయడానికి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లా నుంచి రైతు నాయకుడు రాఘవేంద్రకుమార్ హైదరాబాద్ వచ్చారు. ఈ మేరకు ఆయనను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు మంగళవారం కలిశారు. రైతు నాయకుడు రాఘవేంద్రకుమార్ హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ రాష్ట్రంలోని రైతులు, దళితులను ఉత్తేజపరిచి కేసీఆర్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిపరడిన యూపీ ప్రజలను ప్రత్యేకంగా కలువనున్నారు.
పేదలు, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వారికి వివరించి మద్దతును కూడగట్టనున్నారు. తన ఆహ్వానం మేరకు హైదారబాద్‌కు వచ్చిన రాఘవేంద్రకుమార్కు వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు కోటపాటి తెలిపారు. రాఘవేంద్రకుమార్ నెల రోజుల పాటు ఇక్కడే ఉండి ప్రచారం చేస్తారని చెప్పారు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిల భారత రైతు నాయకుల సదస్సుకు హాజరైన రాఘవేంద్రకుమార్ ..కేసీఆర్ ఇచ్చిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పిలుపునకు అభిమానిగా మారాడు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన రాఘవేంద్రకుమార్కు కోటపాటి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు.