వర్ని(రుద్రూర్), మార్చి 24: బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి కొట్టుకున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. పోలీసులు వచ్చి లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాలకు చెందిన 25 మందిపై కేసులు నమోదు చేశారు.
కోటగిరి మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు (పోచారం వర్గీయులు) ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో వర్నిలో టీ పాయింట్ వద్ద టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో వర్ని మండలానికి చెందిన అధికార పార్టీ నేతలు (ఏనుగు వర్గీయులు) అక్కడే ఉండడంతో మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కొట్టుకుంటున్నారని సమాచారమందుకు న్న పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రెండు వర్గాలకు చెందిన 25 మందిపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.