బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుసరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యమా, గూండా రాజ్యమా అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి సీఎం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.