పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించే కార్మికుల శ్రమను దోచుకుంటున్నది. నిజా మాబాద్ నగరంలో చెత్త సేకరించే కార్మికులకు మాస్క్, గ్లౌజ్‌లు, షూ విధిగా ఇవ్వాలి. కానీ ఇవేమీ ఇవ్వకపోవడంతో కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చెత్త సేకరిస్తున్నారు.
వానకాలం కావడంతో మురికి కాలువలు, రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తున్నది. కొన్నిచోట్ల దోమలు వృద్ధి చెంది స్వైర విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు రోగాల బారిన పడకుండా కనీసం మెడికల్ కిట్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్