ప్రజలను వంచించిన కాంగ్రెస్
ఎన్నికల ముందు ప్రతి వర్గానికి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చా క రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను ఇలా అం దరినీ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండిపడ్డారు. జొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి, రైతులకు మద్దతు కల్పించాలని డిమాం డ్ చేస్తూ పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు.
- హామీలను అమలుచేయడంలో విఫలం
- రైతులను పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం
- జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
పిట్లం, మే 15: ఎన్నికల ముందు ప్రతి వర్గానికి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చా క రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను ఇలా అం దరినీ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండిపడ్డారు. జొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి, రైతులకు మద్దతు కల్పించాలని డిమాం డ్ చేస్తూ పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో షిండే పాల్గొని కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ. 15 వేల సాయం, కౌలు రైతులకు ఆర్థిక భరోసా, వరికి బోనస్, ప్రతి పంటకు మద్దతు ధర, రైతుబీమా కొనసాగింపు, వృద్ధులకు పింఛన్ల పెంపు, మహిళలకు భరోసా, నిరు ద్యోగులకు ఉపాధి అవకాశాలు అంటూ అనేక హామీలు ఇచ్చిందని గు ర్తుచేశారు. కానీ నేడు రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు.
వృద్ధులకు భరోసా అంద డం లేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదని, గ్రామీణ ప్రాం తాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. పిట్లం మం డల భవిష్యత్తును మార్చే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ నాగమడుగు అని పేర్కొన్నారు. రూ. 476 కోట్ల నిధులతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మంజూరుచేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని, రైతు భవిష్యత్తు మారేదన్నారు.కానీ కాం గ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయి కాంట్రాక్టర్ వెళ్లిపోయే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. పిట్లంలో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ పనులు మధ్యలోనే నిలిపోయాయని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రజారోగ్యంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం
30 పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణం పూర్తయినా ప్రారంభోత్సవం చేయడంలో జాప్యం నెలకొన్నదన్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పిట్లం ప్రజలు అందించిన సుమారు 2700 మెజార్టీతో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో జొన్నకు మార్కెట్ ధర రూ. 1250 మాత్రమే ఉన్నప్పటికీ రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అదనపు భారం భరించి రూ. 2,500 వరకు గిట్టుబాటు ధర కల్పించిందని గుర్తుచేశారు.రైతు చెమట చుక్క విలువ తెలిసిన ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని, నేడు కాంగ్రెస్ పాలనలో కొనుగోలు కేంద్రాలు లేక రైతు దళారుల దోపిడీకి గురవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

