అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘డిసి’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ నిర్మించింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ పాత్రికేయులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఇదొక గ్యాంగ్‌స్టర్ కథ. దేవదాస్, చంద్ర, పార్వతి అనే మూడు పాత్రల చుట్టూ కథ నడుస్తుంది.
‘దేవదాస్’ అంటే అందరికి క్లాసిక్ లవ్‌స్టోరీ గుర్తుకొస్తుంది. అవే పాత్రలను గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ తయారుచేశాం. లోకేష్గారికి హీరోగా తొలిసినిమా అయినా..అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఈ సినిమాలో కథానాయిక వామికా గబ్బి సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తుంది. దేవదాస్‌ను కలిసిన తర్వాత ఆమె జీవితం ఎలా మారిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అనిరుధ్ సంగీతం సినిమాకు హైలైట్. ఏషియన్ సినిమాస్ ద్వారా ‘డిసి’ తెలుగులో విడుదలకావడం ఆనందంగా ఉంది’ అన్నారు.