నందిపేట్, ఆగస్టు 10: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రజాక్షేత్రం లో కేసీఆర్ మళ్లీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నందిపేట్ మండల పర్యటన సం దర్భంగా ఖుద్వాన్పూర్ వంతెన పరిశీలించి మాట్లాడారు.
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ కాగా, కేంద్రంలో అధికారంలోని బీజేపీ ప్రభు త్వం తెలంగాణ ప్రజలను చీటింగ్ చేయడంలో టాప్‌లో ఉన్నదని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు గా ల్లో కలిసిపోయాయని, 420 హామీల అమలు ఊసే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా ఉన్నదని తెలిపారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఇంకా 30 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న జీవన్‌రెడ్డి ..
రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయం నెలకొన్నదన్నారు. రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని, పల్లెల్లో పాలన పడకేసిందన్నారు. రేవంత్ ది దిక్సూచి లేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. పల్లెల నుంచి పట్టణాల వరకు కాంగ్రెస్, బీజేపీ పతనం షురూ అయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పేరు వింటేనే ప్రజలు భగ్గుమంటున్నారని తెలిపారు. ఇక నుంచి జిల్లావ్యాప్తంగా పర్యటిస్తానని, బీఆర్ఎస్ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నిలకు సమాయత్తం చేస్తానని వెల్లడించారు.
కేసీఆర్ దయతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తొలి సీఎం కేసీఆర్ దయతోనే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు. రూ.150 కోట్లతో పంచెగూడ వంతెన నిర్మాణం పూర్తి చేసి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల మధ్య దూర భారం తగ్గించిన ఘనత కేసీఆర్‌దన్నారు. మరో వంద కోట్లతో నియోజకవర్గంలోని పలు వంతెనలు నిర్మించిన కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌రెడ్డి మధ్య ప్రొటోకాల్ రగడ తప్ప వారు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూ న్యమని విమర్శించారు. బీఆర్ఎస్ హ యాంలో మంజూరైన స్కీమ్లకే కొ బ్బరికాయలు కొట్టడం, పాతగోడలకు సున్నాలు కొట్టి మందికి పుట్టిన బిడ్డ తమ గొప్పేనని జబ్బలు చర్చుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఖుద్వాన్పూర్ -కొండాపూర్ రోడ్డు వెంటనే నిర్మించాలని డి మాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతామన్నారు.