వినాయక్‌నగర్, జూన్ 13: నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి సునీత కుంచాల సూచనల మేరకు న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మహిళలు ఇంట్లో వంట చేసే సమయంలో గ్యాస్ సిలిండర్ నుంచి ప్రమాదవశాత్తు మంటలు వచ్చినప్పుడు..వాటిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాక్‌డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్, సీనియర్ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్,మాణిక్ రాజ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.