Kotagiri | కోటగిరి, మార్చి 26 : కల్లుగీత కార్మికుల కుటుంబాల ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మ భిక్షం అని తెలంగాణ గీత పనివార సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. కామ్రేడ్ ధర్మ భిక్షం 15వ వర్ధంతి వేడుకల సందర్భంగా కోటగిరి గీతా పరిశ్రమ సహకార సంఘం భవనంలో కల్లు గీత కార్మికులు గౌడ కులస్తులు గురువారం ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల కుటుంబాల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం ఆని గుర్తు చేశారు.
కల్లు సొసైటీలు ఏర్పాట్లు గీత కార్మికులకు టీఎఫ్టీ లైసెన్సులు, వృద్ధులకు పెన్షన్, మన పెంపకానికి భూముల కోసం పోరాడిన మహానీయుడు గీత వృత్తిదారుల కోసం తెలంగాణ గీత పని వారాల సంఘం స్థాపించిన నాయకుడు అని కొనియాడారు. తుది శ్వాస ఉన్నంత వరకు గీత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసమే పోరాడిన మహానాయకుడు ధర్మపురిషం వారి ఆశయ సాధనకోసం కల్లుగీత కార్మికులు అందరూ కృషి చేయాలని కోరారు. ఆయన చూపిన పోరాట బాటలోని నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటగిరి టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, గీత పని వారాల సంఘం మండల నాయకులు వెంకట్ గౌడ్, శ్రీధర్ గౌడ్, రాజా గౌడ్, నరేష్ గౌడ్, ఏ శ్రీనివాస్ గౌడ్, సాయి కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.