CPI leaders demand | కోటగిరి, ఆగస్టు 30 : భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ గౌడ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు రైతులు సాగుచేసిన వరి, సోయా ఇతర పంటలు పూర్తిగా నీట మునిగాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన వాపోయారు.
వర్షానికి దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షానికి కూలిపోయిన ఇండ్ల బాధితులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం కోటగిరి నాయబ్ తహసీల్దార్ కు సీపీఐ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల గంగాధర్, బుడాల రాములు తదితరులు పాల్గొన్నారు.