నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. పేదలపై భారం మోపుతూ కార్పొరేట్ శక్తులకు బడ్జెట్‌ను అనుకూలంగా రూపొందించారంటూ ఆయా సంఘాల నాయకులు ఆరోపించారు. సీఐటీయూ, కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేపట్టారు. బడ్జెట్ ప్రతులు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంతోపాటు బోధన్, ఆర్మూర్, వర్ని, చందూర్, మాక్లూర్, రెంజల్, నవీపేటలో నిరసనలు కొనసాగాయి.