కంఠేశ్వర్, అక్టోబర్ 8:ధాన్యం సేకరణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. బోధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, రైస్‌మిల్లర్లతో సమీక్షించారు.
ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, రైతులు ఏమాత్రం ఇబ్బందులు పడినా, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగినా సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా వెయింగ్ మిషన్లు, ఆన్లైన్ వివరాల నమోదుకు ట్యాబ్‌లు సమకూర్చుకోవాలన్నారు.
అధికారులంతా సమష్టిగా, సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, డీఎస్వో అరవింద్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్, సివిల్ సైప్లెస్ డీఎం రమేశ్, డీఏవో వాజిద్ హుస్సేన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.