అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలి
ప్రజాపాలన సభల్లో ప్రజలు అందించే అన్నిరకాల దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఖుద్వాన్పూర్, వన్నెల్(కే), మచ్చర్ల, ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలన సభలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
నిజామాబాద్ స్పోర్ట్స్/ఆర్మూర్‌టౌన్/ నందిపేట్, జనవరి 2: ప్రజాపాలన సభల్లో ప్రజలు అందించే అన్నిరకాల దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఖుద్వాన్పూర్, వన్నెల్(కే), మచ్చర్ల, ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలన సభలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటర్ల ఏర్పా టు, అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫా రాలు, వలంటీర్లు, సిబ్బందితోపాటు ప్రజలకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు, ప్రజలు ఏ పథకం కోసం అధికంగా దరఖాస్తు చేసుకున్నారనే వివరాలపై అధికారులను అడిగి తెలసుకున్నారు. దరఖాస్తులో పొందుపర్చిన పథకాలతోపాటు ఇతర అంశాలపై కూడా ప్రజలు సమర్పించే అర్జీలను తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించారు.
రేషన్‌కార్డులు, రెవెన్యూ సంబంధిత అంశాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు తదితర ఏ విషయంలోనైనా అధికారులకు వినతిపత్రాలను అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే, ఐదు గ్యారెంటీలు కాకుండా ఇతర అంశాలపై వచ్చే దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్ట్రర్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రసీదు అందించాలన్నారు. దరఖాస్తులు అందించేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్‌కుమార్, నోడల్ అధికారి జగన్నాథాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్..
రామారెడ్డి, మాచారెడ్డి మండలంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. మాచారెడ్డి మండలం బండ రామేశ్వర్‌పల్లి, అక్కాపూర్‌లో గ్రామసభలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

