రామారెడ్డి, మే 19: వచ్చే ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు 95శాతం పూర్తిచేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, గిద్ద గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వడ్ల తేమను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 350 కొనుగోలు కేంద్రాల ద్వారా 46,613 మంది రైతుల నుంచి రూ.576కోట్ల విలువచేసే 2.61లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు.
ఇప్పటి వరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.504కోట్లు జమ చేసినట్లు వివరించారు. 200 కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేశామ ని, మిగిలిన కేంద్రాల్లోనూ మొత్తం ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, వర్షాలు పడినా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌మిల్లులకు పంపిస్తామని పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, తహసీల్దార్ తదితరులు ఉన్నారు.