కామారెడ్డి,జూన్ 5: గ్రూప్-1వ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9న పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో చీఫ్ సూపరిటెండెంట్లు, బయోమెట్రిక్ శిక్షణ అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4,797 మంది అభ్యర్థులు 12 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షలు సాఫీగా నిర్వహించేందుకు నియమించిన 12మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్, రూట్ అధికారులు ముందుగా ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్‌కు ఏఎంఎంలను నియ మించాలని, సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని తెలిపారు. బయోమెట్రిక్ పద్ధతిన నిర్వహిస్తున్న ఈ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 1గంట వరకు జరుగుతుందని అన్నారు. బయోమెట్రిక్ యంత్రాలు ఒకరోజు ముందుగా జిల్లాకు వస్తాయని, వాటిని పరీక్షించి ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, పరీక్షల రీజినల్ కోఆర్డినేటర్ విజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.