ఆర్మూర్‌టౌన్, మార్చి 6: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. శుక్రవారం ఆమె ఆలూర్ మండ లం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రిజిస్ట్రేషన్ సెంటర్, ఇన్ పేషంట్, ల్యాబ్ , ఫార్మసి, ఇమ్యూనైజేషన్ తదితర విభాగాలను పరిశీలించారు. దవాఖానలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్.. అటెండెన్స్ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్ రక్షిత అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించకుండా, సరిగ్గా వివరాలు అందించని ఏఎన్ఎం పద్మాలతకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.