Gandhari | గాంధారి, జులై 4 : గాంధారి నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి పై గాంధారి శివారులోని గొద్దెల వాగు వంతెన శుక్రవారం కురిసిన వర్షానికి ఓ వైపు వంతెన కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుండి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇది ఇలాగే ఉంటే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొత్తం ధ్వంసమయ్యే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం ఈ వంతెన మీదుగానే వందల సంఖ్యలో వాహనాలు రాకపోగులు సాగిస్తాయని, వంతెన కోల్పోతే గాంధారి-బాన్సువాడ మధ్య రాకపోకలు నిలిచిపోతాయని వాహనదారుల పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే మరమ్మతు చర్యలు ప్రారంభించాలని వాహనదారులు కోరుతున్నారు.