CM Relief Fund | పెద్ద కొడప్ గల్, మే 04: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.
కాటేపల్లి తాండలో లబ్ధిదారులు బద్దవోల్ కమలాబాయికి రూ.37వేలు, జైపాల్ రూ.56 వేలు చెక్కులను వైద్య సేవల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామచందర్, సొసైటీ వైస్ చైర్మన్ గంగాగౌడ్, షేక్ చాంద్ పాషా, సుధర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.