రుద్రూర్, ఫిబ్రవరి 8 : పేదల కల సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతీ పేదకు నీడ కల్పించేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిక్కడ్‌పల్లిలో మంగళవారం నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు మల్లేశ్ తండ్రి, జింక సాయిలు తల్లి ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాలను సురేందర్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరవుతాయని, మరో 30 ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి సొంత స్థలం లేనివారికి ప్రభుత్వ స్థలంలో నిర్మించేలా అధికారులతో చర్చిస్తామన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో ఇప్పటివరకు గ్రామంలో చాలా అభివృద్ధి జరిగిందని అన్నారు. సభాపతి వెంట ఉంటే అందరికీ న్యాయం చేకూరుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, వైస్‌ఎంపీపీ సాయిలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, సీనియర్ నాయకులు మచ్కూరి హన్మంతు, లాల్‌మహ్మద్, గోపాల్, రాము, మోహన్, డాక్టర్ మల్లేశ్, వీడీసీ చైర్మన్ మక్కయ్య, నక్క గంగాధర్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని కోటయ్య క్యాంపులో డబుల్ బెడ్రూం ఇండ్లనిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, ఉప సర్పంచ్ కంది కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, పెనిమర్తి శ్రీహరి, హైమద్ తదితరులు పాల్గొన్నారు.