సీఎం కేసీఆర్ సభ విజయవంతం
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో శుక్రవారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహిళలు, యువకులు, యువతులు, వృద్ధులు తరలివచ్చారు.
ఆర్మూర్, నవంబర్3: ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో శుక్రవారం నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. కేసీఆర్ సందేశాన్ని వినేందుకు మహిళలు, యువకులు, యువతులు, వృద్ధులు తరలివచ్చారు.
సభ హైలైట్స్
- కొందరు మహిళలు చంటి పిల్లలను చంకనేసుకొని సభా స్థలానికి చేరుకున్నారు.
- వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా సభకు వచ్చారు.
- మధ్యాహ్నం వరకే ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి బస్సులు, వ్యాన్లు, ద్విచక్ర వాహనాలపై సభా స్థలాకి జనం చేరుకుంది.
- మధ్యాహ్నం 12 గంటల వరకే సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసింది.
- 2 గంటల పాటు ధూంధాం కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
- ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌రెడ్డి సభా ప్రాంగణంలో జనంతో కలిసి ప్లకార్డులు చేత పట్టుకొని కేరింతలు కొడుతూ సందడి చేశారు.
- సభలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మర్ డాక్టర్ మధుశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, ఓయూ నేత రాజారాంయాదవ్, పట్టణ నాయకులు చేసిన డాన్స్‌లు సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- మధ్యాహ్నం 3.38 గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో సభ వెనుక భాగంలోని హెలిప్యాడ్‌కు చేరుకోగానే సభా ప్రాంగణం జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది.
- 3.50 గంటలకు సీఎం కేసీఆర్ హెలిప్యాడ్ నుంచి బస్సులో సభా వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. కేసీఆర్ రాకతోనే సభా ప్రాంగణం కేరింతలు, ఈలలు, కేకలతో హోరెత్తింది.
- 3.56 గంటలకు ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్ ముందుగా అంకాపూర్ గ్రామం, వ్యవసాయ విధానంపై మాట్లాడారు. ఆర్మూర్ దవాఖానకు సాధారణ ప్రసూతిలో అవార్డు రావడాన్ని ప్రస్తావించారు.
- 4.14 గంటల వరకు మొత్తం 18 నిమిషాల పాటు అనేక అంశాలపై సభలో కేసీఆర్ ప్రసంగించారు.
- హెలికాప్టర్లో ప్రయాణం.. మరో సభకు వెళ్లాలి… ఇక నాకు సెలవు ఇప్పించండి .. అని సభలో ప్రజలకు తెలుపుతూ ఆర్మూర్ నుంచి కోరుట్లకు వెళ్లారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

